15 August, 2026 | 1:51 AM

రామప్ప నీటితో గణప సముద్రం సరస్సు నింపాలి

15-08-2026 12:54 AM
  1. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు 
  2. మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ  

గణపురం ఆగస్టు14 (విజయ క్రాంతి): రామప్ప నుండి  దేవాదుల నీటిలో గణప సముద్రం సరస్సు ను వెంటనే నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని నీటి పారుదల శాఖాధికారులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు. శుక్రవారం గణపురం మండలపరిషత్ కార్యాలయం లో ఎమ్మెల్యే  అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు,

రూ. 1350కన్నా డి.ఏ.పిని విక్రయించాలని ఎక్కువ ధ ఎక్కువ ధరకు అమ్మే ఫర్టిలైజర్ షాపులను వెంటనే సీజ్ చేయాలని వ్యవసాయాధికారులను ఎమ్మెల్యే దేశించారు. ఆదేశించారు. జిల్లాకు 100 టన్నుల డి.ఏ.పి కేటాయించడం జరిగిందని వెంటనే తెప్పించి రైతులకుఅందించాలన్నారు, మండలానికి మంజూరైన ఆర్ అండ్ బి రోడ్లు పూర్తి చేయాలని,రోడ్డు వెంట పోతున్న కరెంటుస్తంభాలు, మంచినీటి పైఫ్ లైన్లు తిరిగి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

విద్యుత్ శాఖ, ఆర్ డబ్ల్యుస్, అధికారులు జాప్యం చేయకుండా ఎస్టిమేట్లు చేసి ఇవ్వాలన్నారు, ప్రభుత్వం త్వరలో  భూములకు పట్టాలిచ్చే అధికారాన్ని ఎమ్మెల్యేలకు  ఇస్తున్నందు అర్హులైన  పేదవారికి పట్టా అవ్వబోతున్నట్లు తెలిపారు, ఎస్ ఐ ఆర్ లో తొలగించబడుతున్న 4,000 ఓట్లలో పొరపాటున సరిదిద్దాలని తాసిల్దార్ అడ్లూరి రాజేశ్వరరావు ను ఎమ్మెల్యే ఆదేశించారు.

సభ్యులు కోరిన అభివృద్ధి పనులు వచ్చే మండల సర్వసభ్య సమావేశం నాటికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి  ఎం.పి.డి.ఓ. ఎల్ భాస్కర్, గణపురం చెల్పూరు సొసైటీ అధ్యక్షులు గండ్ర సత్యనారాయణ రెడ్డి, కన్నబోయిన కుమార్ యాదవ్,  వివిధశాఖల మండల అధికారులు ‘పాల్గొన్నారు..