29 June, 2026 | 2:04 AM

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

29-06-2026 12:00 AM

మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం

వీపనగండ్ల, జూన్ 28: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ గ్రామ సర్పంచ్ మీసాల పార్వతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్లు  ఏఎన్‌ఎంలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు