calender_icon.png 25 October, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

25-10-2025 12:00:00 AM

జిన్నారం, అక్టోబర్ 24 : జిన్నారం మండ లం గడ్డపోతారం మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేయడంపై కాం గ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం వార్డు కార్యాలయం ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజుగౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రాజు గౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కాం గ్రెస్ పాలలోనే సాధ్యమని అన్నారు. రూ.15 కోట్ల నిధులతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.