calender_icon.png 25 October, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారులకు మహర్దశ

25-10-2025 12:00:00 AM

జిల్లాలో 140.66 కిలోమీటర్ల నిర్మాణానికి చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి):జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించే ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు జిల్లా యంత్రాంగం తో పాటు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. జిల్లాలో 30 రహదారులకు 140.66 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.ఇప్పటికే ప్రభుత్వం (హెచ్‌ఎఎం) హమ్ పథకం కిందా ఫేస్ వన్‌లో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా త్వరలో టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

30 రోడ్లు 140.66 కిలోమీటర్లు..

జిల్లాలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది మొదటి దఫలో 30 రోడ్ల ను మంజూరు చేయగా 140 కిలోమీటర్ల వరకు రహదారుల నిర్మాణం చేసేందుకు ముందు సాగుతుంది. అసిఫాబాద్ మండ లం పీడబ్ల్యూడీ రోడ్డు నుండి గోవిందపూర్ 2.40, పీడబ్ల్యూడీ నుండి ఈధులవాడ  4.80, పిఆర్ రోడ్డు నుండి వట్టి వాగు ప్రాజె క్ట్  3.40, వీవీపీ రోడ్డు నుండి బలాన్పూర్ 22.50, వీవీపీ రోడ్డు నుండి కౌటకూడా 5.25, పీడబ్ల్యూడీ రోడ్డు నుండి పర్స్నంబాల 5.00, కెరమెరి మండలంలో ఎన్టీఆర్ రోడ్డు నుండి సవర్ ఖేడ 4.45, కేలి కే నుండి బో లా పటార్ ఏసాపూర్ 6.90, ఓడిఆర్ అనర్పల్లి నుండి శంకర్ గూడా వయా కరంజి వాడ 4.50, వాంకిడి మండలంలో వీఆర్‌ఎస్ నుండి జాముల్దరి 2.65, ఎస్ హెచ్-1 నుండి కోమటి గూడ 3.80, పీఆర్ రోడ్డు నుండి మూకాసిగూడ వయా సరెండి 9.30, పీఆర్ రోడ్డు నుండి మార్క గూడ 1.00, జై నూరు మండలంలో పిడబ్ల్యుడి రోడ్డు నుండి జామిని 0.95, పీడబ్ల్యూడీ రోడ్డు నుండి పవర్ కూడా పొలాస 3.05, సిర్పూర్ యూ మండలంలో ఆర్‌ఎఫ్ రోడ్ మహాగావ్ నుండి గుమ్నూరు బీ వయా ధనురా చాపరి 5.80, పీడబ్ల్యూడీ రోడ్డు పవర్ కూడా నుండి దేవుడుపల్లి 1.30, లింగాపూర్ మండలంలో రాము నాయక్ తండా నుండి ఎల్లపటార్- గోండుగూడా 3.15, ఆలీ కూడా నుండి పిక్లాతాండ వయా గుమ్మనూరు- కాం చనపల్లి- కొత్తపల్లి -13.20, చింతల మానపల్లి మండలం గుడ్ల బోరి నుండి బాబా పూర్ వయా సైదాపూర్ 2.00, కౌటాల నుండి కోరిసిని వయా రన్వెల్లి 10.00, కౌటాల మండలం గుడ్ల బోరి నుండి బాబా పూర్ వయా సైదాపూర్ 3.30, కాగజ్ నగర్ మం డలం ఆర్.బి రోడ్డు నుండి కొత్త సరసాల 0.90, ఆర్.బి రోడ్డు నుండి వంజరి 2.70, బెజ్జూర్ మండలం జెడ్పి రోడ్డు నుండి ముం జంపల్లి 1.46, పెంచికల్ పేట్ మండలం ఎలుక పల్లి నుండి నెల్లూరు 2.20, దాహే గాం మండలం పీపీ.రావు కాలనీ నుండి సుర్జాపూర్ 8.60, సిర్పూర్ టీ మండలం ఎస్ హెచ్ 7711 నుండి శివపూర్ వయ షేక్ అహ్మద్ గుడా, ఎండీ.ఆర్ నుండి పొడస 1.80 కిలోమీటర్ల రోడ్లు మంజూరు అయ్యాయి. 

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కట్టుబ డి పని చేయడం జరుగుతుంది. రాజకీయాలు ఒక వైపు అయితే మరోవైపు ప్రజా సంక్షే మం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రణాళిక బద్ధంగా జిల్లా అభివృద్ధికి కట్టుబడి ప్రభు త్వం ముందుకు వెళుతుంది.జిల్లాలోని సమస్యలను పరిష్కరించేందు కు ప్రత్యేక కార్యాచరణతో అధికార యంత్రాంగం తో కలిసి ముందుకు వెళ్లడం జరుగుతుంది.

 దండేవిఠల్, ఎమ్మెల్సీ 

అభివృద్ధిలో ప్రజా ప్రభుత్వం రాజీపడదు

ప్రజా ప్రభుత్వం అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. దశలవారీగా అభివృద్ధి పనుల ను ముందుకు తీసుకు వెళ్తాం.జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు కృషి చేయడం జరుగుతుంది.మా దృష్టికి వచ్చిన సమస్యలను వెనువెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

- కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, డీసీసీ అధ్యక్షుడు