08-09-2025 12:00:00 AM
ఫ్యాక్టరీని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల
అశ్వారావుపేట, సెప్టెంబర్ 7, (విజయ క్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లోని ఆయిల్ ఫెడ్ కి చెందిన పామాయిల్ ఫ్యాక్టరీతరచుగా ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరా తీశారు.ఆదివారం ఉదయం 7 గంటలకే మంత్రి ఫ్యాక్టరీ నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరుచు గా యంత్రాలు ఎందుకు మరమ్మత్తులకు గురవుతున్నాయి అని అధికారులను అడిగితెలుసుకున్నారు.
పామాయిల్ రైతుల లుతీసుకొచ్చే గెలలు దిగుమతికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు. బ్రేక్ డౌన్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తుమ్మల అన్నారు.తెలంగాణ వ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం లోని 31 జిల్లాల్లో ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు కు అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు.
ఒక్కో ఉమ్మడి జిల్లాకు లక్ష ఎకరాలు చొప్పున పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు టార్గెట్ పెట్టుకున్నట్టు తుమ్మల తెలిపారు.సిద్దిపేట లో కొత్త గా నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ నీ త్వరలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్టు మంత్రి తెలిపారు.పామాయిల్ గెలలు టన్ను పాతిక వేలు రూపాయలు ఉండేలా ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కి స్వయంగా కలిసి వివ రించిన్నట్టు తెలిపారు.
ఆత్మ గౌరవం తో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమేనని అన్నారు.రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉండ బోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.ఆయిల్ ఫామ్ సాగు లో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి హబ్ గా మారనుంది అని తెలిపారు.
ఆయిల్ ఫామ్ లో అంతర పంటల సాగు, రైతులకు అదనపు ఆదా యం తెచ్చి పెడుతుందన్నారు.ఆయిల్ ఫెడ్ తో పాటు ప్రైవేట్ రంగంలో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ లు ఏర్పాటు తో ఆయిల్ ఫామ్ రైతులకు దీర్ఘకాలిక మేలు జరుగుతుందని తెలిపారు. మంత్రి వెంట ఆయిల్ ఫెడ్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పామాయిల్ రైతులు ఉన్నారు.