17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మంత్రి చిత్ర పటానికి క్షీరాభిషేకం

20-02-2026 02:08 AM

చిన్నంబావి, ఫిబ్రవరి 19:మండల కేంద్రంలోని వాల్మీకి చౌరస్తాలో మండల వాల్మీకి నాయకులు గురువారంరాష్ట ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.కొల్లాపూర్ లోఇటీవల జరిగిన మున్సిపాల్టీ ఎన్నికల్లో కౌన్సిలర్ విజయం సాధించిన వాల్మీకి బిడ్డ రెడ్డి సత్యం జ్యోతికి మున్సిపాలిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించిన సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుకు మండల వాల్మీకి సంఘం అధ్యక్షుడు ఉమేష్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి బోయలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారని,ఇతర పార్టీలు మెజార్టీ వర్గాలను రాజకీయ ప్రతినిధుల కంటే ఓటు బ్యాంకుగా చూస్తున్న తరుణంలో మంత్రి ప్రత్యేక చొరవతో అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తాలూకా వాల్మీకి సంఘం అధ్యక్షుడు పి.రాజ్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగారి శ్రీను,సుధాకర్ నాయుడు, గువ్వల రామకృష్ణ,శివ నాయుడు, రమేష్, గోవింద్, సురేష్,ఆంజనేయులు,శివకాంత్ తదితరులు పాల్గొన్నారు.