3 August, 2026 | 4:37 PM

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

03-08-2026 03:56 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంచిర్యాల ఎం ఎల్ ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా రెడ్ క్రాస్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి సోమ వారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు ఈ నెల 15 నుంచి నెలవారీ  సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయడం గమనార్హం అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు, నాయకులు, రెడ్ క్రాస్ అసోసియేషన్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.