3 August, 2026 | 4:33 PM

చేనేత సహకార సంఘం భవన నిర్మాణానికి స్థల పరిశీలన

03-08-2026 03:59 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పాల కేంద్రం ఎదురుగా ఉన్న చేనేత సహకార పరపతి సంఘానికి చెందిన స్థలాన్ని సోమవారం సంఘం పాలకవర్గ సభ్యులు, పట్టణ కుల పెద్దలు పరిశీలించారు. ఈ స్థలంలో చేనేత సహకార సంఘం భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

భవన నిర్మాణానికి అవసరమైన అంచనాలు (ఎస్టిమేట్) సిద్ధం చేయాలని స్థానిక ఏఈకి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థలంలో గతంలో నాటిన కడీలు, అప్పటి జిల్లా కలెక్టర్ దయాచారి ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో భవన నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామని చేనేత సహకార సంఘం చైర్మన్ గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్ తెలిపారు.