calender_icon.png 16 January, 2026 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

140 మంది ఆశావాహులకు ఎంఐఎం దరఖాస్తుల అందజేత

16-01-2026 06:18:17 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుసలాంలో ఆపార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ శుక్రవారం నగరంలోని 40 డివిజన్ల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎంఐఎం తరపున పోటీ చేసే 140మంది ఆశావాహులకు ఎంఐఎం పార్టీ దరఖాస్తు ఫారాలను అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎంఐఎం దారుసలాం హైదరాబాద్ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో 3000వేల డీడీతో, దరఖాస్తు ఫారాలను నింపి ఈనెల 20న సాయంత్రం 6 గంటల వరకు ఎంఐఎం పార్టీ కార్యాలయం కరీంనగర్లో అందజేయాలని పేర్కొన్నారు.

ప్రజల మద్దతు ఉన్నవారికి, గెలుపు గుర్రాలకు ఎంఐఎం పార్టీ టికెట్లు కేటాయిస్తుందన్నారు. ఎవరైనా టికెట్లు ఇప్పిస్తామని మీదగ్గరకు వస్తే ఆశావాహులు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం పార్టీ నాయకులు బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, ఇబ్రహీం, అఖీల్ ఫిరోజ్, అలిబాబా, అజర్ దబీర్, మాజిద్ హుస్సేన్, అరిఫ్ అహ్మద్, అన్నిమల్ల సురేష్, సాజిద్, లింగంపల్లి శ్రీనివాస్, మజారుద్దీన్, వాజిద్ అలీఖాన్, అజీముల్లా ఖాన్, ఫసియుద్దీన్ ఖాలీద్, జమ్మూ ఇష్తీయాక్, ఆవేజ్, తదితరులు పాల్గొన్నారు.