16-01-2026 06:16:06 PM
క్రీడా స్ఫూర్తిని నింపుతూ భారీ ర్యాలీ
మునుగోడు,(విజయక్రాంతి): జిల్లా యువజన క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కప్ క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహిస్తోంది. మండల కేంద్రంలోకి సీఎం కప్ టార్చ్ ర్యాలీ చేరుకోవడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి కప్ క్రీడా జ్యోతి ర్యాలీకి ప్రభుత్వ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికి మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, వయస్సు తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడుతూ శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవ్వాలనే రాజ్ గోపాల్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఇన్‌చార్జ్ తహసీల్దార్ నేలపట్ల నరేష్ , నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, మునుగోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, జితేందర్ రెడ్డి మండల, పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.