16-01-2026 06:20:09 PM
తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్
తుంగతుర్తి (విజయక్రాంతి): అరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తుంగతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో గల సామాజిక వైద్య కేంద్రం నందు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడుతుందని దిక్కులేని వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.