15-02-2026 07:02:39 PM
- స్వచ్ఛందంగా 12 బాటిల్లు అందజేత
- సేవలపై స్థానికులు ప్రశంశలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మహాశివరాత్రి వేడుకలకు వెళ్లే భక్తులకు మినరల్ బాటిల్ పంపిణీ చేసి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. కొందరు సామాజిక సేవకులు. బెల్లంపల్లి బుగ్గ దేవాలయం మహాశివరాత్రి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో వెళ్లారు. భక్తులను జాతరకు తీసుకువెళ్లే ఆర్టీసీ బస్సులు వేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి ఈ బస్సులు భక్తులను తీసుకువెళుతున్నాయి. పాత బస్టాండ్ వద్ద ప్రముఖ కాంట్రాక్టర్ చిప్ప అజయ్ కుమార్,వ్యాపారులు దుర్గం బ్యాంగిల్ గోవిందు, క్యాతం శ్రీనివాసు భక్తులకు 1200 బాటిల్స్ అందజేశారు. జాతరకు వెళ్లే భక్తులు పెద్ద ఎత్తున పాత బస్టాండ్ కి చేరుకున్నారు. దాహార్తి తీర్చేందుకు మినరల్ వాటర్ బాటిళ్లు అందజేసి తమసేవ భవాని చాటుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు వాటర్ బాటిళ్ళు అందజేసిన వారిలో సేవలను స్థానికులు అభినందించారు.