1 July, 2026 | 9:03 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మినీ బస్సు బోల్తా: పలువురికి గాయాలు

18-03-2026 12:00 AM

శేరిలింగంపల్లి, మార్చి 17 (విజయక్రాంతి): మియాపూర్ సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పిన ఓ మినీ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రైవేట్ ఉద్యోగులు స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగించింది. లీ ఫార్మా సంస్థకు చెందిన మినీ బస్సులో సుమారు 10 మంది ఉద్యోగులు కేపీహెచ్బీ నుంచి గడ్డిపోచారం పరిశ్రమ ప్రాంతానికి వెళ్తున్నారు.

బాచుపల్లి దారిలో టాటా మోటార్స్ సమీపంలోని మలుపు వద్ద వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపై పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఒకరికి తలకు గాయం కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.