తనిఖీలు సరే చర్యలు ఏవి?
- రెడ్ హ్యాండెడ్‌గా కల్లు కొనుగోలుకు వచ్చి పట్టుబడ్డ చిన్నారులు
చర్యలు తీసుకొని ఎక్సైజ్ అధికారులు
కల్లు మూస్తే దారులకు వత్తాసు పలికిన ఎక్సైజ్ అధికారులు
కల్తీ కల్లు, బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల జోరు
మామూళ్ల మత్తులో ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది
ఎట్టకేలకు మేలుకున్న చర్యలు మాత్రం సున్నా
‘విజయ క్రాంతి’ కథనానికి స్పందన చర్యలు మాత్రం శూన్యం
కామారెడ్డి, మార్చి 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఎక్సైజ్ అధికారుల ఆదేశాలను క ల్లు మూస్తే దారులు బే ఖతార్ చేస్తున్నారని విజయ క్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఎక్సైజ్ అధికారులు తోతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి క ల్లుదుకాణంలో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులకు వారి కళ్ళముందే కల్లు ను కొనుగోలు చేసేందుకు చిన్నారులు రావడం చూసి షాక్ గురయ్యారు.
కల్లు మూస్తే దారులకు ఎన్నిసార్లు అవగాహన సదస్సు నిర్వహించిన చిన్నారులకు 18 సంవత్సరాల లోపు పిల్లలకు కల్తీకల్లు విక్రయాలు చేయరాదని చేస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణాలను సేవ్ చేస్తామని ఎక్సైజ్ అధికారులు, మరోవైపు పోలీస్ అధికారులు హెచ్చరించడంతో పాటు కల్లు దుకాణాలలో ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు.
దాంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కల్లుమూస్తే దారులు మాత్రం అధికారుల నిబంధనలను పట్టించుకోకుండా తుంగలో తొక్కుతున్నారు. దేవునిపల్లి కళ్ళు దుకాణం వద్ద ముగ్గురు చిన్నారులు కల్లు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడే కనిపించారు. కేవలం కళ్ళు విక్రయదారులను హెచ్చరించి చిన్నారులను వదిలిపెట్టారు తప్ప కేసులు నమోదు చేయలేదు.
ఎందుకంటే క ల్లు ముస్తేదారులతో ఎక్సైజ్ అధికారులకు లోపాయి కారి ఒప్పందం తో పాటు నెలసరి మామూళ్లు ముట్ట చెపుతుండడంతో ముస్తేదారులకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది కొమ్ము కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముస్తేదారులు లైసెన్సులు మాత్రం కొన్ని దుకాణాలకు తీసుకొని మరికొన్ని దుకాణాలు లైసెన్సులు లేకుండానే కల్తీ కల్లు విక్రయిస్తున్నార అనే ఆరోపణలు వస్తున్నాయి.
నిత్యము పర్యవేక్షిస్తున్న అధికారులు మాత్రం వారికి ఏ దుకాణాలు లైసెన్స్ పొందారు ఏ దుకాణాలు లైసెన్సులు పొందలేదు తెలిసినా కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇలాంటి పరిస్థితి ఉంటే మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో కల్తీ కల్లు దుకాణా లైసెన్సులు లేకుండా ఎన్ని నడిపిస్తున్నారు అనేది ఎక్సైజ్ అధికారులకే తెలియాలి మరి.
ఒకవైపు చిన్నారులు కల్తీ కల్లు కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులకు తీసుకుని ఇస్తున్నవారు కొందరైతే మరికొందరు కల్లు దుకాణాల్లోనే కల్తీ కల్లును సేవిస్తున్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు కల్తీకల్లు అమ్మకాలు చేపట్టవద్దని వైన్సులు, కల్లు దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసిన అవి మాత్రం ఏమాత్రం పట్టింపు లేవు. నియంత్రించాల్సిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు, మామూళ్ల మత్తు కు కళ్ళు మూస్తే దారులకు,
వైన్స్ యజమానులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి హడావిడి చేయడమే తప్ప చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పేపరులలో వార్తలు రావడం వల్లే చెకింగ్లకు వస్తున్నామని కళ్ళు మూస్తే దారులకు వైన్స్ యజమానులకు చెప్పుతున్నారంటే వారికి లోపాయి గారి ఒప్పందం ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్థానిక అధికారులు ముస్తేదారులతో కుమ్మక్కై కల్తీ కల్లు విక్రయాలతో పాటు గ్రామాలలో బెల్టు షాపులు విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు చెకింగ్లకు వెళ్తున్నామని ఎక్సైజ్ అధికారులు టూర్ లిస్ట్ పెడుతున్న కేసు నమోదు చేయడం లేదు. తనిఖీల పేరిట మామూలు దండుకుంటున్నారని పలువురు కల్లు మూస్తే దారులే బహిరంగంగా చెప్పడం కోస మెరుపు.
ఉన్నతాధికారులు చొరవ చూపుతారా..?
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఒకవైపు బెల్ట్ షాపులు, మరోవైపు కల్తీ కల్లు అమ్మకాలు జోరుగా సాగుతున్న జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్, ఎస్పీ అధికారులు విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై సిబ్బందిపై చర్యలకు పూనుకుంటేనే కల్తీ కల్లు విక్రయాలు అరికట్టే అవకాశాలు ఉన్నాయి. పట్టణాల్లో, పల్లెల్లో, బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుపుతూ పేద, మధ్యతరగతి, ప్రజ లు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నామ్కే వస్తేగా తనిఖీలు చేయకుండా కల్తీకల్లు ఆగడాలను, బెల్టు షాపుల విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎంత మేరకు ఎక్సైజ్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
తనిఖీలు చేపడుతున్నాం
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో కల్తీకల్లు విక్రయాలపై తనిఖీలు చేపడుతున్నాం. కల్లు మూస్తే దారులకు ఎక్సైజ్ సిబ్బంది సహకరిస్తున్నారా అని వివరణ కోరగా అలాంటిదేమీ లేదని తమకు ఫిర్యాదు వస్తే విచారణ జరిపి అలాంటి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు చెప్పడం కోసం మెరుపు.
హనుమంతరావు, ఎక్సైజ్ సూపర్డెంట్, కామారెడ్డి




