06-12-2025 05:27:13 PM
యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వైద్య బృందం ఘనత..
సిద్దిపేట (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో 60 ఏళ్ల గుండె రోగి సింగిరెడ్డి నరసింహ రెడ్డికి మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. యశోద హాస్పిటల్ సివిటిఎస్ సర్జన్, కార్డియాలజిస్ట్ డాక్టర్ విశాల్ ఖానాటే నేతృత్వంలో వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసింది. తేలికపాటి గుండెపోటు వచ్చిన అనంతరం రోగి సిద్దిపేటలోని ఒక ఆసుపత్రిలో యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకోగా, గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నట్లు గుర్తించారు. బైపాస్ శస్త్రచికిత్స అవసరమని సూచించడంతో, రోగి బంధువు భాస్కర్ రెడ్డి సలహాతో అతన్ని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్‌కు తరలించారు.
రోగికి మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ విధానం గురించి పూర్తి వివరాలు అందించిన తర్వాత, కేవలం రెండు నుండి మూడు చిన్న కోతలతో ఆధునిక శస్త్రచికిత్సను డాక్టర్. విశాల్ ఖానాటే విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో పెద్ద కోతలు లేకపోవడంతో రోగికి తక్కువ నొప్పి, ఇన్ఫెక్షన్ అవకాశం తగ్గడం, గాయం త్వరగా నయం కావడం, కోలుకునే వేగం అధికంగా ఉండడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరించారు. సాధారణంగా నాలుగు నుండి ఐదు రోజుల్లోనే రోగిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ఆధునిక శస్త్రచికిత్స ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో యశోద హాస్పిటల్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించింది. మినిమల్లీ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్స ఓపెన్ హార్ట్ సర్జరీకి సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని, చిన్న కోతల ద్వారానే గుండె శస్త్రచికిత్సలు నిర్వహించగలిగే అత్యాధునిక వైద్య సాంకేతికతగా ఇది అభివర్ణించారు.