calender_icon.png 6 December, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

06-12-2025 05:24:47 PM

వేములవాడ అర్బన్/కోనరావుపేట (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలంలోని కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవికుమార్ సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశీలనలో ఆయా మండలాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.