25-04-2025 02:44:39 AM
అద్దె భవనం లేక అవస్థలు.
ప్రస్తుతం ఉన్న భవనం ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి.
రెండు రోజులుగా నిలిచిపోయిన సేవలు
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వినియోగదారులు.
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : నాగర్ కర్నూల్ జిల్లా మైనింగ్ శాఖ కా ర్యాలయానికి అద్దె భవనం దొరకక అవస్థలు తప్పడం లేదు. గత కొద్దికాలంగా ప్రస్తుతం ఉన్న అద్దె భవనంలో కార్యాలయం ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తేవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. గత ప్రభుత్వం అన్ని శాఖలకు ఉమ్మడిగా జిల్లా ల్లో కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించినప్పటికీ ఆ కార్యాలయంలో మైనింగ్ శాఖకు భవనాన్ని కేటాయించకపోవడంతో చాలాకాలంగా మార్కెట్ యార్డ్ సమీపంలోని అదే భవనంలోనే మైనింగ్ శాఖను కొనసాగించారు. గత కొన్ని నెలలపాటు ఖాళీ చేయా లని ఒత్తిడి తెచ్చినప్పటికీ అధికారులు స్పం దించకపోవడంతో గత రెండు రోజుల క్రితం అద్దె భవనం యజమానులు కార్యాలయానికి ఇంటర్నెట్, విద్యుత్ కనెక్షన్ వంటివి తొలగించారు.
దీంతో కార్యాలయానికి సేవ లు అందుకునే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని ఆయా రెంట్ బిల్డింగ్ కోసం అన్వేషణ జరుగుతున్నప్పటికీ రెంట్ ధర ఎక్కువగా చెబుతుండడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ప్రభు త్వం నిర్మించిన పాత కలెక్టరేట్ భవనం, ప్రస్తుత కలెక్టరేట్ భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని కార్యాలయాలు నేటికీ అద్దె భవనంలోనే కొనసాగుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం అద్దె భవనం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మై నింగ్ శాఖ కార్యాలయానికి కూడా జిల్లా ఉన్నతాధికారులు కార్యాలయాన్ని ఏర్పాటుకు సహకరించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులు.ప్రస్తుతం జిల్లాలో మన ఇసుక వాహనం పథకం అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వినియోగదారులు సామాన్యులు ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఆన్లైన్ దరఖాస్తులను చేసుకుంటున్నారు. దీంతోపాటు ఆయా వినియోగదారులకు రీచ్ నుం చి ఇసుకను తరలించిన అనంతరం వాటి నివేదికలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉం టుంది ఆ తర్వాతే ఇసుక ట్రాక్టర్ యజమానులకు చెల్లింపులు బ్యాంకు ద్వారా పూర్తి అ వుతాయి. దీంతోపాటు మైనింగ్ శాఖ సం బంధించిన అన్ని సేవలు నిలిచిపోయాయి. దీంతో సామాన్యులు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది.
మరో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం.!
ప్రస్తుతం అద్దె భవనం కోసం జిల్లాలో అక్కడక్కడ అన్వేషణ జరుగుతోంది. గురువారం ఒక ప్రాంతంలో అద్దె భవనాన్ని పరిశీలించారు. శుక్రవారం లేదా శనివారం రో జు పరిశీలించి మైనింగ్ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం సేవలు ఫోన్ ద్వారా కొనసాగిస్తూనే ఉన్నాం.
-నాగ చైతన్య, ఆర్‌ఐ, మైనింగ్ శాఖ.