25-04-2025 02:49:24 AM
ఐలాండ్, నెక్లెస్ రోడ్ నిర్మాణాలకు రీఎస్టిమేట్
మూడు వారాల్లోపు నివేదిక తయారు చేసే పనిలో అధికార యంత్రాంగం
పారదర్శకంగా అభివృద్ధి చేస్తాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ కు తలమాణికంగా మారనున్న పెద్ద చెరువు సుందరీక రణ పనులకు పారదర్శకంగా ముందుకు తీసుకుపోయేందుకు ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వం పెద్ద చెరు వును అభివృద్ధి చేసే పనులను ప్రారంభించినప్పటికీ ఆ పనులు మధ్యలోనే ఆగిపో యాయి. గతంలో పెద్ద చెరువు అభివృద్ధి లో భాగంగా ఐలాండ్, నెక్లెస్ రోడ్ నిర్మాణం తో పాటుపలు సదుపాయాలు కల్పించేందుకుగాను రూ 49.99 కోట్ల ఖర్చు చేసి పను లు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఎస్టిమేట్ వేయడం జరిగింది. కాగా కేవలం రూ 7 కోట్లు మాత్రమే గతంలో మంజూరయ్యాయని అధికారులు లెక్కలు చెబుతున్నాయి.
నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఆగిపోయాయని ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమా వేశం మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దిశగానే పెద్ద చెరువు సుందరీకరణ పనులను ముందుకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు మం త్రి జూపల్లి పెద్ద చెరువు సంబంధించి పలు అభివృద్ధి పనులను చేసేందుకు రీ ఇస్టిమేట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేవలం మూడు వారాల్లో ఈ నివేదిక అందజేయాలని ఆదేశాలు ఉండడంతో అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
అవసరం మేరకు... అభివృద్ధి..
ప్రజలకు ఎంత మేరకు అవసరం ఉం టుందో.. అంతకు ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి చేసే పనిలో ప్రజా ప్రభుత్వం ఎల్ల ప్పుడు ముందు ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముం దు నుంచి చెబుతూ వస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఆవిష్కృతమై దాదాపుగా 17 నెలలు కావస్తున్నా ఇటీవల పెద్ద చెరువు పై పనులను ప్రారంభించారు. పెద్ద చెరువు పని ఇక జరగదు అనుకున్న వారి ఆలోచనలకు ముగింపు పెడుతూ ఎమ్మెల్యే పక్క ప్రణాళికలతో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తు న్నారు. పెద్ద చెరువు లో చేయనున్న అన్ని రకాల అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో రీ ఎస్టిమేట్ వేసి పూర్తిస్థాయిలో వినియోగిలోకి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం అడుగులు పక్క ప్రణాళికలతో వేస్తుంది.
ప్రచారం కాదు పని ముఖ్యమంటున్నా ఎమ్మెల్యే..
ప్రజలు తమకు మద్దతు తెలిపింది ప్రచారం చేసుకునేందుకు కాదని పని చేసి వారి ముందు ఉంచేందుకు అని ముందు నుంచి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సం దర్భంగా వచ్చినప్పుడల్లా చెబుతూ వస్తున్నా రు. ఇక ఆగిపోయింది అనుకున్న పెద్ద చెరు వు పనులు ఇప్పటికే ఒక దశలో ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయిలో పనులు ప్రారంభిం చేందుకు మరి ఎంతో సమయం లేదని తెలుస్తుంది. ఆర్ అండ్ బి అతిథి గృహం దగ్గర వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం రూ 4 కో ట్లు ఖర్చు చేసి నిర్మాణంలో ఆగిపోయిన భవనమును ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేం ద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రూ 17 కోట్లు అవసరం ఉంటుందని నివేదిక ఉత్తర్వులను మంజూరు చేయించి, రూ 10 కో ట్లు విడుదల చేపించి త్వరలోనే పండ్లను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారు. మెట్టుగడ్డ దగ్గర డైట్ కళా శాల కు సంబంధించిన భూమిలో నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కి సంబం ధించి నిర్మాణంలో ఆగిపోయిన ఆ భవనంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు చదువు అందిస్తే ఆ కుటుంబాలు సమస్య లేని కుటుంబాలుగా తయార వుతాయని ఎమ్మెల్యే ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.
హంగు ఆర్భాటాలు వద్దు...అభివృద్ధి ముఖ్యం
ఏదో చేస్తాం.. ఏదో చెబుతాం అం టూ ముందుకు సాగేది లేదు. చేస్తున్న ప్రతి పని పారదర్శకంగా జరుగుతుందా? జరగదా ? అని చెప్పుకుం టూ చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాం లో చేసిన అన్ని పనులను పరిగణలోకి తీసుకుంటున్నాం. మహబూబ్ నగర్ ప్రజలకు ఆ పనుల్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో పూర్తిస్థాయిలో పట్ట ణంలోని మేధావులతో చర్చించి అవసరమైన పనులను చేస్తున్నాం. విద్య వి ద్యార్థికి అందుబాటులో ఉంచితే భవిష్యత్తులో ఆ కుటుంబాలు ఉన్నత శిఖరాల కు అధిరోహిస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. ఆ దిశగానే విద్య అందుబా టు లోకి ఉంచాలని ఉద్దేశంతో ప్రతి అడు గు విజ్ఞానం ను అందించాలని తపతో అడుగులు వేస్తున్నాను. అభివృద్ధిలో అందరూ బాగా ముందుకు సాగుదాం.
-యెన్నం శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే, మహబూబ్ నగర్