15 June, 2026 | 10:40 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి

03-04-2026 12:37 AM
  1. ప్రమాదాలు పునరావృతం కాకుండా 

చర్యలు చేపట్టాలనీ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ

ధర్మపురి, ఏప్రిల్2 (విజయక్రాంతి)ధర్మపురి పట్టణ శివారులో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధర్మపురి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న రాష్ట్రసాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను గురువారం పరామర్శించి ఓదార్చారు.

ప్రభుత్వం తరుపున అండగా ఉంటాం అధైర్య పడొద్ధoటూ మృతుల కుటుంబాలకు మంత్రి భరోసా కల్పించారు.ప్రమాదం జరిగిన తీరును ఆయన పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను ఆదేశించారు.ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఇతర బాధితులను సైతం ఆయన పరామర్శించారు.గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.