జై వీర హనుమాన్
జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామి శోభయాత్ర
శోభాయాత్రకు పోలీసుల గట్టి బందోబస్తు పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాతో పాటు జిల్లా కేంద్రంలో నీ హనుమాన్ ఆలయాల్లో నిన్న రాత్రి నుండి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అనుమాన ఆలయాల్లో ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణలతో పాటు శోబయాత్రలు నిర్వహించారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం నుండి ఈ హనుమాన్ శోభయాత్ర గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నీలకంఠేశ్వర ఆలయం నుండి ప్రారంభమైంది.
కేశవ యాత్రను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కుల చారి నిజామాబాద్ సిటీ సాయి చైతన్య ప్రత్యేక పూజలు సమర్పించారు. పూజా కార్యక్రమం అనంతరం జండా ఊపి శోభయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో అదే సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో యజ్ఞ హోమం నిర్వహిహించారు. ప్రత్యేక ఆకర్షణగా శ్రీరామచంద్రమూర్తి భారీ విగ్రహం శివుడు నంది లింగం అలంకరించిన వాహనం శివాజీ మహారాజ్ గురు దత్తాత్రేయ. తదితర భారీ విగ్రహాల వాహనాలను ఈ శోభాయాత్రలో కొనసాగాయి.
సుభాష్ నగర్ సుభాష్ నగర్ నాందేవాడ నాందేవాడ దేవి రోడ్డు దేవి రోడ్డు స్టేషన్ రోడ్డు మీదుగా నెహ్రూ పార్క్ స్టేషన్ రోడ్డు మీదుగా నెహ్రూ పార్క్ శివాజీ నగర్ చౌ శివాజీ నగర్ చౌక్ కు ఈ శోభాయాత్ర ఈ చేరుకుంది చేరుకుంది. హనుమాన్ మాల ఘరానా హనుమాన్ మాల ధర్నా చేసిన స్వాములు ధర్నా చేసిన స్వాములు, విశ్వహిందూ పరిషత్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ బజరంగ్దళ్, శివాజీ సేన, నగర యువకులు నగరయు యువకులు శ్రీరామ భక్తులు శ్రీరామ భక్తులు మహిళలు పిల్లలు పాల్గొన్నారు. మరికొందరు భక్తులు స్వచ్ఛందంగా మజ్జిగ మంచి నీటి పంపిణీ చేశారు.
శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది..
హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో భజరంగ్ దళ్, హిందూ వాహినీల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని నీల కంటేశ్వర ఆలయం వద్ద ఊరేగింపును నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే దన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. భారీ హనుమంతుని విగ్రహంతో పాటు శివుడు, రాముడు, భరత మాత, చత్రపతి శివాజీ లాంటి ప్రతిమలు ఊరేగించారు.
నగరంలోని ప్రధాన వీధులు, మార్గాల మీదుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. హనుమాన్ మాల దారులు యువకులు జీజేపీ తో పాటు అనుబంధ విభాగాల సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నిర్వహకులు అనాల కోసం అడుగడుగునా మంచినీటి సౌకర్యం మజ్జిగ పండ్లు పండ్ల రసాలు లాంటి వసతులు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ 1300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా అంతా కూడా ఆధ్యాత్మికత వెలివేసింది. హనుమాన్ ఆలయాల్లో నగరంలోని పలు వీధులు జిల్లాలోని అన్ని అనుమాన్ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భిక్కనూర్‌లో..
భిక్కనూర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో హనుమాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చిత్రపటాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. బాలస్వాములు హనుమాన్ వేషధారణలో ఆకట్టుకున్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని సాతల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాధా నాగరాజ్ ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహాన్ని ఊరేగింపు హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాధా నాగరాజు హనుమాన్ మాలాదారులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామసభ 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి, సర్పంచ్ రాధా నాగరాజు చర్చించారు.
నాగిరెడ్డిపేటలో..
నాగిరెడ్డిపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మండలంలోని హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. బంజర తండా గ్రామం నుండి గోపాల్పేట్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. చిన్న ఆత్మకూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలకు మాజీ జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతుని నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించి ఆశీస్సులు పొందారు. యువకులు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి, ఏప్రిల్, 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండలంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కృష్ణాజివాడి, నందివాడ, ఎర్ర పహాడ్, ఎండ్రియాల, చిట్యాల, దేమికలాన్, బ్రాహ్మణపల్లి, తాడువాయి గ్రామాలలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హనుమాన్ చాలీసా చదివారు. తాడువాయిలో హనుమాన్ భక్తులు ప్రత్యేకంగా భజన సంకీర్తనలు నిర్వహించారు.




