calender_icon.png 3 August, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినతి పత్రం అందజేత

03-08-2025 12:46:09 AM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం చైతన్యపురి మహాశక్తి ఆలయంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేకుర్తి 18వ డివిజన్ కొత్తవాడ కాలనీ నేతకాని (నేతశాలి) కుల సంఘం స్మశాన వాటిక కు బోరు వేసి మోటారు తోపాటు స్నానాల గదులు, ప్రహరీ గోడ నిర్మించుటకు నిధులు మంజూరు చేయాలని కాలనీవాసులతో వినతిపత్రం అందించారు. బండి సంజయ్ కుమార్  సానుకూలంగా స్పందించారని అన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నేతకాని కుల సంఘం రేకుర్తి అధ్యక్షులు బండారి లక్ష్మిరాజం, కొత్తవాడ నేతకాని కుల సంఘం అధ్యక్షులు ఎం లక్ష్మీరాజం,  కుల సంఘ నేతలు దుర్గం శ్యాంసుందర్, గొల్లే రమేష్, దుర్గం లింగమూర్తి, గోదరి నరేష్, చంద్రకాంత్, గోల్లే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.