03-08-2025 12:46:29 AM
-మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
-మహబూబాబాద్ బాలికల గురుకుల సందర్శన
మహబూబాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): మెనూ ప్రకారం అల్పాహారం అం దించకుండా బ్రేక్ ఫాస్ట్‌గా కారం మెతుకులు పెట్టడం ఏమిటని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. పిల్లలు ముద్దగా మారి న అన్నం తినలేక ఖాళీ కడుపులోనే తరగతి గదులకు వెళ్లాల్సిన దుస్థితి మహబూబాబా ద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పడిందని పేర్కొన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని గురుకుల హాస్టల్‌ను ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంట గదిలోకి వెళ్లి పిల్లలకు అందిస్తున్న అల్పాహారం చూశారు. ఒక గిన్నెలో కారం పొడి, మరో పెద్ద గిన్నెలో వండిన అన్నం ముద్దగా మారడం, కొంత మాడిపోవడం చూసి ఇదేనా పేద విద్యార్థులకు అమలు చేస్తున్న మెరుగైన సంక్షేమం అంటూ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలను పూర్తిగా గాలికి వదిలేసారని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతానని డబ్బా కొట్టుకోవడం తప్ప ఒక్క స్కూలు కట్టింది లేదన్నా రు. గురుకులాల నుంచి విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడమేనా అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాల్లో మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం సక్రమంగా అమలు చేసేలా చూడాలన్నారు.