calender_icon.png 3 August, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసులు, కొట్లాటలు నాకు కొత్తకాదు

03-08-2025 12:45:48 AM

మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): తన కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్లాలని స్పష్టం చేసిందని, తనకు ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ కేసులు, కొట్లాటలు తనకు కొత్త కాదని, తన జీవితమే ఒక పోరాటమని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె తెలిపారు.

ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమని, ఇది జరిగి రెండు రోజులైందన్నారు. అయితే కొంత మంది పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ సోదరులు కొండా కేసులో సంచలనమం టూ వార్తలు రాయడంలో వారి ఉత్సాహం చూస్తుంటే తనకు చాలా సంభ్రమాశ్చర్యమనిపిస్తోందని మంత్రి సురేఖ అన్నారు.