18 April, 2026 | 12:56 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

బీజేపీ నేతలు అరెస్ట్ పై స్పందించిన మంత్రి బండి సంజయ్

01-04-2025 11:59 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): కంచ గచ్చిబౌలిలో భూవివాదం దృష్ట్యా హెచ్‌సియూ సందర్శనకు యత్నించిన బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై కేంద్రం మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని బండి పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలోని భూమికి సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోందని, అక్కడున్న భూములను వేలం వేయడం కుదరదని బండి సంజయ్ స్పష్టం చేశారు. విషయం తెలిసి కూడా ప్రభుత్వం కోర్టు దిక్కరణకు పాల్పడుతోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గచ్చిబౌలి భూముల అమ్మకం నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బండిసంజయ్ చెప్పారు. అలాగే హెచ్‌సియూ సందర్శనకు బీజేపీ నేతల పిలుపు దృష్ట్యా బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్టు చేసి, బంజారాహిల్స్ లోని మహేశ్వర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. హెచ్‌సియూ భూములను పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌సియూ భూముల వద్ద వాస్తవ పరిస్థితులను  బీజేపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవలనుకున్నారు. కానీ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసుల మోహరించి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డగించి అరెస్ట్ చేశారు.