24 July, 2026 | 5:34 PM

ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

24-07-2026 04:54 PM

ముకరంపుర, జూలై 24(విజయక్రాంతి): విద్యా రంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ అలసత్వానికి నిర్లక్ష్య మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ ఉద్యమ కార్యచరణ లో భాగంగా శుక్రవారం కరీంనగర్ గ్రామీణ మండలం నగునూరు ఉన్నత పాఠశాలలో తపస్ జిల్లా, మండల శాఖల అధ్యక్షులు అన్నమనేని తిరుపతిరావు, బుర్ర నాగరాజుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఆగస్టు 1వ తేదీన తపస్ చలో హైదరాబాద్ మహా ధర్నా  కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం తమ మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయ ఉద్యోగుల  అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  మండల శాఖ అధ్యక్షుడు బుర్ర నాగరాజు తో పాటు జిల్లా మండల బాధ్యులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గోన్నారు.