24 July, 2026 | 5:34 PM

ఎస్సీలకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

24-07-2026 04:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారికి (డీఆర్వో) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సాధు ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగాల్లో అమలులో ఉన్నట్లుగానే ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లోనూ 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.