23 May, 2026 | 12:45 AM

24న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

23-05-2026 12:08 AM

నిర్మల్ జిల్లా మే 22:( విజయ క్రాంతి): పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు & ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మే 24న అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.ముందుగా అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘మోడల్ వెజిటబుల్ మార్కెట్’ స్థలాన్ని మంత్రి పరిశీలిస్తారు.

అనంతరం మావలలో రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, రూ.47 లక్షల వ్యయంతో నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ (మొదటి అంతస్తు) భవనాన్ని ప్రారంభిస్తారు.అనంతరం గాయత్రి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, చక్రాల కుర్చీలు, మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేస్తారు.

ఎస్డీఆర్‌ఎఫ్ (SౄRF) బృందానికి వరద నియంత్రణ, విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం అవసరమైన పరికరాలను పంపిణీ చేస్తారు.అదేవిధంగా రూ.2.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బేలాగూడ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బేలాలో రూ.2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కేజీబీవీ (KGBV) భవనాన్ని ప్రారంభిస్తారు.నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు పి. నర్సారెడ్డి విగ్రహాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరిస్తారు.