త్రివేణి సంగమ స్నానం.. సర్వపాప హరణం
- సరస్వతి అంత్యపుష్కరాల్లో వైభవంగా హోమాలు, ప్రత్యేక పూజలు
- భక్తజన పుణ్యస్నానాలతో ఘాట్లలో సందడి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు
కాళేశ్వరం పుష్కర క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ
ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం/మహబూబాబాద్, మే 22 (విజయక్రాంతి): సరస్వతి అంత్యపుష్కరాల్లో రెండో రోజు శుక్రవారం భక్తజన పుణ్యస్నానాలతో ఘాట్లు సందడిగా మారాయి. హో మాలు, ప్రత్యేక పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సర స్వతి అంత్యపుష్కరాల్లో రెండో రోజు శుక్రవా రం భక్తుల రద్దీ మరింత పెరిగింది. తెల్లవారుజామున నుంచే గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి సంగమ ఘాట్లకు భారీగా చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పితృతర్పణాలు నిర్వహించారు.
‘సరస్వతి నదీ స్నానం పాప విమోచనం’ కలిగిస్తుందన్న విశ్వాసంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అదేవిధంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతు లు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వే డుకల్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడ పాల్గొన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్యపుష్కరాల వేడుకల్లో శుక్రవారం పుష్కర ఘాట్ల వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హోమాలు, గణపతి పూజలు, గోపూజలు, మహామంగళ హారతులు నిర్వహిం చారు.
పీఠాధిపతులు భక్తులకు ఆశీర్వచనా లు అందించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు దీపారాధనలు నిర్వహిం చి, కుటుంబ సౌఖ్యసంపదలు కలగాలని ప్రార్థించారు. భక్తుల సౌకర్యార్థం జిల్లా యం త్రాంగం తాగునీరు, వైద్యశిబిరాలు, చలివేంద్రాలు, మొబైల్ టాయిలెట్లు, ప్రత్యేక పార్కిం గ్ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
ఘాట్ల వద్ద ఎన్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాయి. పుష్కర ప్రాంతమంతా భక్తి గీతాలు, హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సాయంత్రం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమం భక్తుల ను విశేషంగా ఆకట్టుకుంది. రెండో రోజు కూడా భక్తుల రాక కొనసాగుతుండటంతో కాళేశ్వరం పుష్కర క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది.
ముక్తేశ్వర స్వామి సన్నిధిలో గవర్నర్ దంపతులు
గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. త్రివే ణి సంగమంలో గురువారం పుష్కర స్నా నాన్ని ఆచరించిన గవర్నర్ దంపతులు రాత్రి సరస్వతి నవరత్న మాలా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. శుక్రవారం ముక్తీశ్వరస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ పూజారులు పరివట్టం, పూర్ణ కుంభం, మం గళ వాయిద్యాలతో స్వాగతం తెలిపారు. గవర్నర్ దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించి, శ్వే తవస్త్రాలు, లడ్డూ ప్రసాదం, చక్కెర పొంగలి, అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు.
అనంతరం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన దసలి పట్టు వస్త్రాల స్టాల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టస్సార్ పట్టు వస్త్రాల తయారీ విధానాన్ని గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని, సరస్వతి ఘాట్ వద్ద జరుగుతున్న కాశీ పండితుల నవరత్న మాలా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు సంస్కృతికి అద్దం పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం భక్తులకు ఎలాం టి ఇబ్బందులూ కలుగకుండా అన్ని ఏర్పా ట్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశా రు. భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించి, అమ్మ కృపకు పాత్రు లు కావాలని ఆకాంక్షించారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు.






