calender_icon.png 12 December, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు

12-12-2025 02:59:29 PM

హైదరాబాద్: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదని తేల్చిచెప్పారు. నిర్మాతలు, దర్శకులెవరూ మా దగ్గరకు రావొద్దని సూచించారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వం అన్న మంత్రి కోమటిరెడ్డి పేదల కోసమే నిర్ణయాలు అన్నారు. హీరోలకు వందల కోట్ల రెమ్యురేషన్లు ఎవరూ ఇవ్వమన్నారని మంత్రి ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలు కుటుంబాలతో సినిమాలకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలని తెలిపారు. టికెట్ల రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామన్నారు. ఈ సారి పొరపాటు జరిగిందని మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) వెల్లడించారు. టికెట్ల  రేట్ పెంపు అంశంపై అఖండ-2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. ఆదేశాలు ఇచ్చినా టికెట్లు ఆన్లైన్లో ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించింది.