12-12-2025 03:29:39 PM
అటవీ శాఖ అధికారులకు అప్పగింత
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ మండలంలోని చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం అరుదైన అంతరించిపోతున్న గుడ్లగూబ పిల్ల కనిపించడం అక్కడి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆశ్చర్యానికి గురిచేసింది. నేలపై పడిఉన్న దానిని గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. ప్రధానోపాధ్యాయులు కనుకుంట్ల నవీన్ రెడ్డి ఈ విషయాన్ని అటవీశాఖ బీట్ ఆఫీసర్ అశోక్ రెడ్డికి తెలియజేయగా, అధికారులు తక్షణమే పాఠశాలకు చేరుకొని గుడ్లగూబ పిల్లను సురక్షితంగా తమ అధీనంలోకి తీసుకున్నారు. వెటర్నరీ చికిత్స చేయించిన అనంతరం దానిని సరైన అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కనుకుంట్ల నవీన్ రెడ్డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు వి. ఆదిత్య, సిహెచ్. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.