12-12-2025 03:27:45 PM
హైదరాబాద్: హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రయత్నం కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) ను దేశ, విదేశాల మీడియా ప్రశంసించిదని తెలిపారు. సమ్మిట్ ను విమర్శించిన బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను దీవించారని తెలిపారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలు బాగున్నందునే కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించారని వెల్లడించారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ విచ్చలవిడిగా స్వార్థానికి వాడుకుంటోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఈసీని కేంద్రంలోని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. ఓట్ చోరీపై ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో రాష్ట్ర నేతలు కూడా పాల్గొంటారని చెప్పారు. మొత్తంగా 65 శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలచారని తెలిపారు. రెండో విడత, మూడో విడతలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.