12-12-2025 02:25:22 PM
హైదరాబాద్: అంఖండ-2(Akhanda-2) చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టు డివిజన్ బెంచ్(High Court Division Bench)లో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నెల 14 వరకు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి విచారణ ఈ నెల 15 వాయిదా వేసింది. 'అఖండ-2' సిన్మాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
శుక్రవారం మ.1.15 గంటలకు దీనిపై విచారణ జరగనుంది. నిన్న సినిమా టికెట్ల పెంపుపై పిటిషన్ను విచారించిన కోర్టు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను రద్దు చేసింది. దీంతో నిర్మాతలు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. అఖండ- చిత్రంలో నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, శాశ్వత ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగయ్ షెల్ట్రిమ్, రవి, షమ్నా కాసిం, మురళీ మోహన్, తదితరులు నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ మరోసారి అఘోర పాత్రలో తన లుక్, భావోద్వేగ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.