calender_icon.png 12 December, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షుడి అడ్డాలో ఎగిరిన గులాబీ జెండా

12-12-2025 02:10:44 PM

కలిసొచ్చిన మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకుల సమిష్టి ప్రచారం.

తాండూరు, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి సొంత గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెద్దేముల్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన పెద్దెముల్ తాండకు చెందిన దారాసింగ్ జాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎస్సీ జనరల్ గా రిజర్వేషన్ కావడంతో కోట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పడగల బుజ్జమ్మ ను కాంగ్రెస్ పార్టీ తరఫునుండి పోటీలో నిలిపారు.

అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు గ్రామానికి చెందిన డివై చిన్న నరసింహులు కూడా సిద్ధమవుగా అతడిని కాదని బుజ్జమని రంగంలోకి దింపారు. దీంతో నరసింహులు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ఎస్సీ జనరల్ రిజర్వేషన్ అయినచోట మహిళ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలపడం పార్టీకి నష్టం వాటిల్లిందని పార్టీ అభిమానులు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమిష్టిగా ప్రచారం చేయడం కలిసి వచ్చింది. ఏది  ఏమైనా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డాలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం తో  పార్టీ శ్రేణులు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు.