9 May, 2026 | 11:25 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

మామ, బామ్మర్దిని ఇరికించేందుకే హరీష్ సిట్ కోరారు

29-12-2024 05:29 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ (ORR) టోల్ లీజ్ పై సిట్ వేయాలని హరీష్ రావు కోరిన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ మామ, బామ్మర్దిని ఇరికించేందుకే హరీష్ సిట్ కోరారని తెలిపారు. హరీష్ రావు అసెంబ్లీలో కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సిట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ టోల్ లీజుపై విచారణ జరుగుతోందన్న కోమటిరెడ్డి ఫార్ములా- ఈ కార్ రేసులో దోంగలు దొరికారని చెప్పారు.

త్వరలోనే ఓఆర్ఆర్ టోల్ లీజ్ లో అవకతవకలు కూడా బయటపడతాయని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ కోసం ఢీల్లీలో ఉండి ఎంతో కృషి చేశానన్నారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు తమ కృషి వల్ల ముందడుగు పడిందన్నారు. ఆర్ఆర్ఆర్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ కు సహకరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nithin Gadkari)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి ఆర్ఆర్ఆర్ పై అభినందనలు తెలిపారు.