9 May, 2026 | 10:30 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

సంధ్య థియేటర్ నోటీసులు.. సమాధానమిచ్చిన యాజమాన్యం

29-12-2024 05:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): చిక్కడపల్లి పోలీసులు(Chikkadpally Police) సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో నోటీసులిచ్చారు. పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమన్య(Sandhya TheatreManagement) లేఖ ద్వారా సమాధానం ఇచ్చింది. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులున్నాయంటూ యాజమాన్యం పోలీసులకు 6 పేజీల లేఖను పంపించింది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని వెల్లడించారు.  పుష్ప-2 ప్రీమియర్ షోకు విధుల్లో 80 మంది థియేటర్ సిబ్బంది ఉన్నారని పేర్కొంది.

ఈనెల 4,5వ తేదీల్లో థియేటర్ నిర్వహణను మైత్రి మూవీస్(Mythri Movies) తీసుకుందని యాజమాన్యం తెలిపింది. సినిమాల విదుడల గతంలోనూ హీరోలు థియేటర్ కు వచ్చారని, సంధ్య థియేటర్ లో కార్లు, బైకులకు ప్రత్యేక పార్కింగ్ ఉందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనపై మంగళవారం పుష్ప(Pushpa) సినిమా నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్(Chikkadpally Police Station)లో విచారించిన విషయం తెలిసిందే. థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేణుక కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ రూ.2 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ ఘటనలో గాయపడ్డిని బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం కొలుకుంటున్నాడు.