నన్ను తొలగించడం అధిష్ఠానానికి ఇష్టం లేదు: కొండా సురేఖ
హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి తొలగించడంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మీడియా సమావేశం నిర్వహించారు. తనన్ను బర్తరఫ్ చేస్తున్నట్లు ఒక నోట్ మీడియాలో వైరల్ అవుతోందని, మరో ముగ్గురు బీసీ మహిళలకు(BC Women's) పదవులు ఇస్తున్నట్లు నోట్ తిరుగుతోందన్నారు. మీడియాకు ఇచ్చిన నోట్ లో ఊరు, పేరు లేదని, నా వల్ల మరో ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కటం సంతోషమే అని, ఉరిశిక్ష పడిన ఖైదీన కూడా చివరి కోరిక అడుగుతారు.
కానీ నన్ను మాత్రం ఏ వివరణ అడగకుండానే తొలగించారని, ఇలా ఏకపక్షంగా తొలగించటం బాధాకరం ఉందని కొండా సురేఖ వాపోయారు. నన్ను కాంగ్రెస్ మంత్రివర్గం(Congress cabinet) నుంచి తొలగించడం అధిష్ఠానానికి కూడా ఇష్టం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కాంగ్రెస్ హైకమాండ్(Congress cabinet)ను బ్లాక్ మెయిల్ చేశారని, సురేఖను తొలగిస్తారా.. నేను రాజీనామా(Resignation) చేయాలా అన సీఎం బ్లాక్ మెయిల్ చేయడంతోనే అధిష్ఠానం తొలగించిందని ఆమె వివరించారు. కొండల్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, వేం నరేంద్ర రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాపై కుట్ర చేశారని కొండా సురేఖ ఆరోపించారు.






