గణపురంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన సంబరాలు
గణపురం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Praja Government) ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో పాటు గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ, ప్రజా సంక్షేమం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని గణపురం మండల(Ganapuram Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా గురువారం గణపురం మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. వెయ్యి రోజుల ప్రజా పాలన ప్రతి ఒక్కరికి మేలు చేసిందని, సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చెల్పూరు పిఎసిఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి ఓరుగంటి కృష్ణ గౌడ్ భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి చోట మియా గాంధీనగర్ గ్రామ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్ అప్పయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్ , మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్,మండల అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్, దూలం కుమారస్వామి గౌడ్, బత్తిని శివశంకర్ గౌడ్, గౌడ్,ఓరుగంటి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






