3 September, 2026 | 2:46 PM

అందుకే బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది : మంత్రి కొండా సురేఖ

07-06-2024 | 08:42pm

హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరి, కడియం కావ్య, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు బీజేపీ పార్టీ గెలుపు కోసం కృషి చేశారని ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందన్నారు.బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు వల్లే కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు కోల్పోయిందని కొండా సురేఖ మండిపడ్డారు.

వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, తన గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు.  తన తండ్రి కడియం శ్రీహరి పేరుకు మచ్చ రాకుండా ముందుకు సాగుతాన్ని కావ్య అన్నారు. సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతుతో గెలుపొందిన ఆమె రానున్న ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణంలోని గుడిసెవాసుల సమస్యల పరిష్కరించిందేకు తనవంతు కృషి చేస్తానని, కమ్యూనిస్టు వాళ్ల కోసం కూడా అంతే పని చేస్తానని హామి ఇచ్చారు.