రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్
07-06-2024 | 08:25pm
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచాలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. తల్లి దశ దినఖర్మ కార్యక్రమాల కోసం కోర్టు జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం రాధాకిషన్ రావు చంచల్ గూడ జైలులో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన తల్లి అనారోగ్యం కారణంగా మరణించారు. అప్పుడు కూడా తల్లి అంత్యక్రియాల నిమిత్తం ఎస్కార్ట్ బెయిల్ మంజురు చేసింది.






