calender_icon.png 28 October, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లెలమడుగులో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

28-10-2025 07:16:18 PM

అశ్వాపురం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామస్థులు, యువత పెద్దఎత్తున హాజరై ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజానాయకుడని, ఆయన పుట్టినరోజు ప్రతి గ్రామంలో పండుగలా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల రవి, తుము వీర రాఘవులు, బేతం రామకృష్ణ, బిక్షపతి , బచ్చు వెంకటరమణ, మచ్చ నరసింహారావు, సింగం శ్రీధర్, ఆటో నరసింహారావు, నాగేశ్వరరావు, బేతం బాబు, సిద్ధూ, కుంజ భాస్కర్, వెంకన్న, సైదులు, ఏరుపుల నారాయణ, సతీష్, కృష్ణ, గంగరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.