28-10-2025 07:14:32 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): రెటినోపతి అనే వ్యాధి మధుమేహం వ్యాధిగ్రస్తులకు సోకి క్రమంగా అందత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని అందువల్ల ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి వైద్యము చేయడం ద్వారా నివారించవచ్చని అందుకు మెడికల్ కళాశాల ఆప్తాలమాలజీ డిపార్ట్మెంట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా 100 రోజుల స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ కళాశాల ఆప్తాల మాల జి డిపార్ట్మెంట్ ఇన్చార్జితో రెటినోపతి వ్యాధి నివారణపై సమీక్ష నిర్వహించారు.
ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు రెటినోస్కోపీ అనే అత్యాధునిక సాంకేతిక పరికరాన్ని వనపర్తి జిల్లాకు అవసరమైన మేరకు కొనుగోలు చేసి నవంబర్ 14 నుండి 100 రోజులపాటు పి.హెచ్.సి వారిగా గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ఇంటింటికి తిరిగి మధుమేహం వ్యాధిగ్రస్తులకు రెటినోపతి వైద్య పరీక్షలు నిర్వహించాలని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావు, నోడల్ అధికారి డాక్టర్ రియాశ్రీ, ఆప్తాలమాలజీ హెచ్.ఓ. డి డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.