28-10-2025 07:17:59 PM
తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని డి కొత్తపల్లి శివలింగ మాక్స్ సొసైటీని రద్దు చేయాలని కోరుతు డి.కొత్తపల్లి రైతులు మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసిల్దార్ కిషోర్ శర్మ కు వినతి పత్రం అందజేశారు.అనంతరం మాట్లాడుతూ గతం లో సెంటర్ నిర్వహించినపుడు అనేక మంది రైతులను మోసం చేసి అవకతవకలకు పాల్పడినారు ఆరోపించారు. శివలింగ సొసైటీ నిర్వాహకులు రైతుల నుండి సుమారు 143 క్వింటాళ్ల ధాన్యం కాజేశారని ఆరోపించారు.
సొసైటీ నీ రద్దు చేయకపోతే ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు ఈ సంఘటన జిల్లా కలెక్టర్ పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు యానాల సుధాకర్ రెడ్డి తొక్కని సోమేశ్వర్ రెడ్డి నరసింహ రెడ్డి సంపేట కృష్ణమూర్తి దేవరకొండ వెంకన్న దేవరకొండ యాదగిరి నాతి ఉప్పలయ్య కాసం వీరయ్య వేర్పుల గట్టయ్య జీవో వీరాచారి కొండా నాగరాజు కూతటి పెదలింగయ్య కడారి సైదులు కూతాటి లింగయ్య పెరుమాల జానీ తుక్కాను లింగారెడ్డి గైగుళ్ళ సోమయ్య ఉపసర్పంచి పెరుమాల రవి తదితరులు పాల్గొన్నారు.