16 April, 2026 | 10:10 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి

11-06-2025 05:44 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) తీసుకొచ్చిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంలో బుధవారం ములుగు జిల్లాలో పర్యాటించిన మంత్రి పొంగులేటి చిట్ చాట్(Minister Ponguleti Srinivas Reddy Chit Chat) చేశారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారని, జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని ఎద్దేవా చేశారు.

ఎంతటి వారైనా సారే తప్పు చేస్తే చర్యలు తప్పవు అని మంత్రి వెల్లించారు. ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలో పర్యటిచిన ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, సహచర మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఊర్లో గుడి ఉందో లేదో తెలియదు కానీ ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు.

గతంలో రాష్ట్రంలో 24 లక్షల ఇండ్లు ఇచ్చిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వానిదే అని, పేదోడికి ఇండ్లు కట్టించాలనే ఇంగిత జ్ణానం బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోయిందని విరుచుకుపడ్డారు.  ఆ ప్రభుత్వం  93 వేల ఇండ్లకు టెండర్లు ఇచ్చి 60 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేసిందని ఆరోపించారు. మిగిలిన 30 వేల ఇండ్లు మొండి గోడలతో దర్శనమిస్తే.. వాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇచ్చి పూర్తి చేసిందని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాలకు  అదనంగా ఇండ్లు ఇస్తున్నామని, రాష్ట్రంలోని 9862 చెంచు కుటుంబాల మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు.

అర్హులైన పేదలందరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ఎంత తొందరగా ఇండ్లు కట్టుకుంటే అంత తొందరగా బిల్లు చెల్లిస్తామని ఆయన వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి కొనియాడారు.