16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎరువుల కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష

11-06-2025 06:01 PM

హైదరాబాద్: ఎరువుల కంపెనీ ప్రతినిధులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) సమీక్షించారు. సాగు సీజన్ లో అవసరమయ్యే ఎరువుల లభ్యతపై, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం ఎరువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. కేటాయించిన లక్ష్యం కన్నా తక్కువ సరఫరా చేసిన కంపెనీల ప్రతినిధులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువగా సరాఫరా చేసిన ఎరువులను జులైలోగా అందించాలని మంత్రి కోరారు. అన్ని మండలాల్లో రైతుల అవసరాల తగ్గట్టుగా ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని, జిల్లా వారిగా కేటాయించిన ఎరువులను ఆ జిల్లాలోనే పంపిణీ చేసేలా కంపెనీల జాగ్రత్తలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. కల్తీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.