1 March, 2026 | 5:14 AM

వన దేవతలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

28-02-2026 09:50 PM

మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీసమ్మక్క సారలమ్మ దేవాలయానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చేరుకున్నారు. అనంతరం వన దేవతలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

అనంతరం గోవిందరాజు పగిడిద్ద రాజు దేవతల గద్దెల చుట్టూ రాతి నిర్మాణాన్ని,ఆలయ చుట్టూ ప్రకారం ప్రధాన ఆర్చిలను, ప్రహరీ సాండ్ స్టోన్ చిత్రాలను, చుట్టూ డ్రైనేజీ, మీడియా టవర్ లను, గద్దెల చుట్టూ ఉన్నా గ్రిల్స్ లను ఆలయ ఫ్లోరింగ్ ను కులకషంగా పరిశీలించారు అనంతరం మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.