calender_icon.png 5 February, 2026 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్‌గా మారిన మంత్రి పొన్నం

05-02-2026 11:46:51 AM

హైదరాబాద్: హుస్నాబాద్(Husnabad)లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్ అభివృద్ధికి భరోసా ఇస్తూ పర్యటిస్తున్నారు. ఆటో నడుపుతూ మంత్రి పొన్నం ఎన్నికల ప్రచారం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ(Husnabad Municipality) 5 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొలిశెట్టి రాజు కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఎన్నికల ప్రచారంలో భారీ ర్యాలీతో స్థానిక కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడప కు వెళ్తూ మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినీ భారీ మెజారిటీతో గెలిపించాలని పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఓట్లు అభ్యర్థించారు. గడపగడపకు ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణాన్ని ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని 20 స్థానాలు గెలిపిస్తే తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి పొన్నం తెలిపారు.