calender_icon.png 5 February, 2026 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో రేవంత్ చేసిందేమీ లేదు.. అవినీతి తప్ప

05-02-2026 11:33:29 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. అవినీతి తప్ప రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. సింగరేణి టెండర్లలో వేలకోట్లు దండుకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. భూ మాఫియాతో చేతులు కలిపి బీజేపీతో కమ్మక్కయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో(Telangana Municipality Elections) ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.