15 May, 2026 | 5:00 PM

పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు స్పందించి.. ముక్కు నేలకు రాయాలి!

15-05-2026 03:52 PM

హైదరాబాద్: పెట్రోల్, డీజీల్ ధరల(petrol diesel price hike) పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరోపించారు. దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ ఊహించిన విధంగా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఆపారని వివరించారు.

ఎన్నికలు పూర్తికాగానే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా కాకముందే దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ ధరలు పెంచి మరోసారి అన్యాయం చేసిందని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ,బండి సంజయ్ పెట్రోల్ ధరలు పెరగవని చాలాసార్లు మీడియా సమావేశాలు నిర్వహించారని చెప్పారు. నరేంద్ర మోదీ సర్కార్ పెట్రోల్ ధరలు పెంచిందని ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం నయా పైసా పెంచక ముందే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ(Narendra Modi) అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుండేనని గుర్తుచేశారు.

మూడు రోజుల క్రితం ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో పెట్రోల్ ,డీజిల్ తక్కువ వాడండి బంగారం కొనవద్దు, నూనె తక్కువ వాడాలి అన్నప్పుడే ప్రజల నడ్డి విరవపోతున్నారే  అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. ఆరు నెలల స్టాక్ ఉందని చెప్పారు, పశ్చిమాసియా యుద్ధం కారణం చూపుతున్నారని వివరించారు. యుద్ధం ఈరోజు రాలేదు.. ఎప్పటి నుండో ఉందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు స్పందించి ముక్కు నేలకు రాయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.