calender_icon.png 29 July, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

29-07-2025 11:03:35 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్థానికులే అభ్యర్థులుగా ఉంటారని మంత్రి పొన్నం పేర్కొన్నారు. బయట వారికి టికెట్ ఇవ్వం.. అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారని వివరించారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీచేస్తారని మంత్రి వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై సర్వే జరుగుతోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అభ్యర్థులు ఎవరున్నా అందరూ కలిసి పనిచేస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్(Congress ) జెండా ఎగురవేస్తామని మంత్రి తేల్చిచెప్పారు.