calender_icon.png 29 July, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేరుపల్లిలో అటకెక్కిన పారిశుధ్యం

29-07-2025 11:37:48 AM

పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు

జ్వర పిడుతులైన గ్రామస్తులు

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని చేరుపల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో డ్రైనేజీలు వర్షపు నీరు బురదతో చెత్తతో నిండి ఉన్నాయి చేరుపల్లి గ్రామపంచాయతీ అధికారులు చూసి కూడా ఏమి పట్టి పట్టనట్టు ఉంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని ప్రతి ఇంటిలో ఇద్దరు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో బాధపడుతున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి సైడ్ కాలవలలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి బ్లీచింగ్, ఫాగింగ్, చేయించాలని ప్రజలు సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే దృష్టిసారించి పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.